: 'అఖిల్' సమయంలో వినాయక్ చేసిన పని ఇప్పుడు పూరీ చేయరేం?: లోఫర్ డిస్ట్రిబ్యూటర్ల ప్రశ్న
'అఖిల్' చిత్రం విడుదలైన రెండవ రోజునే దర్శకుడు వీవీ వినాయక్ తమకు ఫోన్ చేసి, సినిమా ఫ్లాప్ అయిందని బాధ పడవద్దని, మీ వెనుక నేనున్నానని ధైర్యం చెప్పారని, లోఫర్ విషయంలో పూరీ జగన్నాథ్ ఆ పని చేయలేకపోయారని, డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, రాందాస్ లు విమర్శించారు. సినిమా పరిశ్రమలో భాగమైన తమను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందన్న విషయాన్ని వారు మరిచారని అన్నారు. సినిమా హిట్ అయితే, లాభాల్లో 20 శాతమే తమకు దక్కుతోందని, నష్టపోయిన వేళ, 20 శాతం పెట్టుబడినే తాము కోరుతున్నామని తెలిపారు. గతంలో మహేశ్ బాబు, రజనీకాంత్ తదితరులు తమ చిత్రాలు నష్టపోయిన వేళ, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారని, ఇప్పుడు లోఫర్ విషయంలో ఆదుకోకపోగా, తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.