: శ్రీకాకుళంలో బాణసంచా పేలుడు.. ఇద్దరు సజీవ దహనం
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గురువాంలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది సేపటి క్రితం అక్కడ బాణసంచా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనం కాగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేసవి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.