: ఎన్నిక‌ల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు... రూ.60 కోట్లు సీజ్


తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప‌లు పార్టీలు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న డ‌బ్బుపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ల తనిఖీల్లో భారీగా డబ్బు సీజ్ చేశారు. అధికారులు జ‌రిపిన దాడుల్లో రూ.60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు నుంచే అత్య‌ధికంగా డ‌బ్బు స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. తమిళనాడులో అత్య‌ధికంగా రూ. 24.55 కోట్లు, పుదుచ్చేరిలో అత్య‌ల్పంగా రూ 60.88 లక్షలు సీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

  • Loading...

More Telugu News