: నిబంధనలు మీరిన బీజేపీ ఎంపీకి గులాబి పువ్విచ్చి జరిమానా!


ఢిల్లీలో మలిదశ 'సరి-బేసి' విధానం అమలవుతున్న వేళ, నిబంధనలు మీరిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు విజయ్ గోయల్ కు ఢిల్లీ పోలీసులు జరిమానా విధించారు. ఆయన కారు నంబరును చూసి ఆపిన పోలీసులు జరిమానా చెల్లించాలని కోరగా, ఆయన నిరాకరించి వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్, అక్కడికి వచ్చి గోయల్ కు రోజా పుష్పాన్ని ఇచ్చి, జరిమానా చెల్లించాల్సిందేనని చెప్పారు. దీంతో దిగివచ్చిన ఆయన, పోలీసులు విధించిన జరిమానా చెల్లించి, అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఆపై గోయల్ మాట్లాడుతూ, సరి-బేసి పేరు చెప్పి ప్రజల జేబులను ఆప్ సర్కారు గుల్ల చేస్తోందని, దీనిపై నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. రెండో విడత సరి-బేసి విధానంలో నేడు విధులకు వెళ్లాల్సిన లక్షలాది మంది మెట్రో రైళ్లను నమ్ముకోవడంతో, అవన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News