: పూరీ జ‌గన్నాథ్‌పై దాడి అవాస్త‌వం, మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: డిస్ట్రిబ్యూట‌ర్లు


సినీ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్‌పై తాము దాడి చేశామ‌ని వ‌స్తోన్న వార్తలు అవాస్త‌వ‌మ‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు అభిషేక్, సుధీర్, రాంధాస్ తెలిపారు. ఈ రోజు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. పూరీ ఇంటి కెళ్లిన‌ట్లు, ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు. పూరీపై తామెందుకు దాడి చేస్తామ‌ని ప్ర‌శ్నించారు. దీనిపై విచార‌ణ చేయాల‌ని, త‌ప్పుంటే త‌మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వ్యాఖ్యానించారు. త‌మ‌పై త‌ప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సీసీ కెమెరాలు ప‌రిశీలిస్తే నిజా నిజాలు బ‌య‌ట ప‌డ‌తాయని అన్నారు. త‌మ‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై క్లారిటీ ఇద్దామ‌నే మీడియా ముందుకు వ‌చ్చినట్లు పేర్కొన్నారు. త‌మ‌పై దుష్ప్రచారం చేస్తున్నారని డిస్ట్రిబ్యూట‌ర్లు ఆరోపించారు.

  • Loading...

More Telugu News