: శ్రీవారి దర్శనం మరింత సులభం... ఆన్ లైన్ కోటా మరో 4 వేలు పెంపు
ఈ వేసవిలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, ముందస్తుగా ప్రణాళిక వేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు సౌకర్యంగా ఉండేలా, రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను పెంచుతున్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా రోజుకు 12 వేల టికెట్లను విక్రయిస్తున్న టీటీడీ, ఈ కోటాను మరో 4 వేలు పెంచుతూ, 16 వేలకు చేర్చింది. ఈ టికెట్లను దర్శనానికి వెళ్లే 3 గంటల ముందు నుంచి 60 రోజుల ముందు వరకూ బుక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకూ 24 వేలు, శని, ఆదివారాల్లో 16 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం మాదిరిగానే, వేసవి ముగిసేవరకూ రూ. 50 సుదర్శనం టోకెన్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.