: ‘బుల్లెట్’ వద్దు!... ‘హైస్పీడ్’ చాలు!: అమరావతి రైలు వ్యవస్థపై చంద్రబాబు సర్కారు నిర్ణయం


కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు బుల్లెట్ ట్రైన్ మంత్రం జపిస్తోంది. అయితే ఏపీలోని చంద్రబాబునాయుడు సర్కారు మాత్రం... బుల్లెట్ రైళ్లొద్దు, హైస్పీడ్ రైళ్లు మాత్రమే చాలంటోంది. ఈ మేరకు ఇటీవల చైనా రైల్వేకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం హైస్పీడ్ రైలు వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి పటిష్ట రైలు వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. తొలి దశలో బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, విశాఖల నుంచి అమరావతికి రైలు నెట్ వర్క్ ఏర్పాటు కానుంది. ఈ రైల్వే లైన్లను ఏర్పాటు చేసేందుకు చైనా రైల్వే ముందుకొచ్చింది. వచ్చే నెలలో చైనా రైల్వేకు చెందిన ఉన్నత స్థాయి బృందం అమరావతికి రానుంది. ఆ తర్వాత త్వరలోనే పనులకు పునాది పడుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News