: ఏపీకి ఎదురు దెబ్బ!... ఎఫ్ ఆర్బీఎం పెంపునకు కేంద్రం ససేమిరా!
రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నవ్యాంధ్రకు నిన్న మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్థిక లోటు నేపథ్యంలో అప్పు తీసుకునైనా నెట్టుకొద్దామనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ యత్నానికి కేంద్ర ప్రభుత్వం గండికొట్టేసింది. ఎఫ్ ఆర్బీఎం పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతికి కేంద్రం ససేమిరా అంగీకరించలేదు. నిబంధనలను సాకుగా చూపిన కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వ రుణ యత్నాలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇతోధికంగా సాయం చేయాల్సి ఉంది. అయితే నెలలు, ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయని కేంద్రం... సొంతంగా ఎలాగోలా నెట్టుకొద్దామనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ యత్నాలకూ అడ్డు చెప్పింది. వెరసి కనీస స్థాయిలో నిధులు లేక ఏపీ నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.