: సీటు మార్చే వీలుందా? అని అడిగినందుకు ముస్లిం మహిళకు ఘోర అవమానం


అమెరికన్లు ముస్లింలంటే భయపడుతున్నారు. ఈ భయంతో ఎలా వ్యవహరించాలో తెలియక...వారిని ఇక్కట్లపాలు చేస్తున్నారు. అమెరికాలో ఓ ముస్లిం మహిళకు అలాగే ఘోర అవమానం జరింగింది. మేరీలాండ్ లో ఉండే హకీమా అబ్దుల్లె అనే మహిళ షికాగో నుంచి సీటెల్ కు సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానంలో బయల్దేరారు. విమానం ఎక్కిన తరువాత బయల్దేరేందుకు ముందు సీటు మారే సౌలభ్యం ఉందా? అని ఆమె విమాన సిబ్బందిని అడిగారు. అంతే, వారేమీ మాట్లాడకుండా ఆమెను విమానం నుంచి కిందికి దించేశారు. ఆ తర్వాత పోలీసులు ఎంటరై ఆమెను టికెట్ కౌంటర్ దగ్గరికి తీసుకొచ్చారు. సోమాలియా మూలాలు ఉన్న ఆమె మరికొన్ని గంటలు నిరీక్షించి, మరో విమానంలో సీటెల్ చేరుకున్నారు. అనంతరం సరైన కారణం చెప్పకుండా విమానం దించేయడం తనకు బాధ కలిగించిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News