: పదేళ్ల బాలికకు లెటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల బాలికకు ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలను అభినందిస్తూ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన పదేళ్ల బాలిక అదితి మోదీకి లేఖ రాసింది. అంతేకాదు, ఆయా పథకాలపై తన భావాలను కూడా మోదీకి అదితి వివరించింది. ఆమె లేఖను చదివిన మోదీ ముగ్ధుడై ఆమెకు సమాధానం పంపారు. ఆమె సానుకూల దృక్పథానికి అభినందించారు. తన పథకాలు ఆకట్టుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని తమ కుమార్తెకు లేఖ రాయడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు ఇలా వివరంగా లెటర్ రాయగల నైపుణ్యం ఉందని తమకు తెలియదని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News