: నన్ను వేధించింది సైనికులు కాదు: న్యాయస్థానం ముందు కాశ్మీర్ బాలిక


జమ్మూ కాశ్మీర్లో గత వారం రోజులుగా అల్లర్లకు కారణమైన బాలిక నేడు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చింది. ఏప్రిల్ 12న హంద్వారాలో పాఠశాలకు వెళ్లి వస్తుండగా ఇద్దరు తనను వేధించారని బాలిక న్యాయస్థానానికి చెప్పింది. తనను సైనికులు వేధించలేదని స్పష్టం చేసింది. కాగా, తన భర్త, కుమార్తెను కస్టడీ నుంచి విడుదల చేయాలని బాలిక తల్లి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సైనిక సిబ్బంది ఆ బాలికను వేధించారంటూ పుకార్లు రావడంతో వందలాది మంది వీధుల్లోకి వచ్చి వారిపై రాళ్ల దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆందోళనలు ఉద్ధృతమవడంతో సదరు బాలిక, ఆమె తండ్రి, మరో మహిళను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన ఆందోళనల సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News