: రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం


రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. గత రాత్రి ఓ వివాహానికి వెళ్లిన యువతిని ముగ్గురు యువకులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఆమె వారి కాళ్లు పట్టుకుని బతిమిలాడినప్పటికీ వారు వదల్లేదని, నోటికొచ్చిన బూతులన్నీ తిట్టారని బాధితురాలు తెలిపింది. చివరికి తాను ఇంటికి వెళతానని, జరిగిన ఘటన గురించి ఎవరికీ చెప్పనని చెప్పడంతో, తనపై అత్యాచారానికి తెగబడ్డ దుర్మార్గులు తనను ఆటోలో తిరిగి రాజమండ్రిలో దించేందుకు వస్తుండగా లారీని ఢీ కొట్టారని, దీంతో వారు పరారయ్యారని ఆమె తెలిపింది. తనకు మాత్రం చెయ్యి విరిగిపోయిందని ఆమె తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News