: జడేజా వివాహ వేడుక పరిసరాల్లో కాల్పుల శబ్దం... బిత్తరపోయిన జడేజా!


ఉత్తరప్రదేశ్ లో జరిగే వివాహాల్లో చోటుచేసుకునే తంతు గుజరాత్ లో, అదీ తన పెళ్లిలో చోటుచేసుకోవడంతో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా బిత్తరపోయాడు. తేరుకుని ఏం జరిగిందో తెలుసుకుని చివరికి హాయిగా నవ్వేశాడు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. రాజ్ కోట్ లో అత్తవారి స్టార్ హోటల్ లో రవీంద్ర జడేజా వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అతిధులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి కాల్పులు శబ్ధం వినిపించింది. అంతే, పెళ్లికొడుకు సహా అంతా కంగారుపడిపోయారు. అయితే, ఆ కాల్పులు జడేజా వివాహం సందర్భంగా ఆనందంతో ఓ మిత్రుడు గాల్లోకి జరిపిన తుపాకి కాల్పులని తేలింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు మాత్రం ఊరుకోలేదు. దీనిపై కేసు నమోదు చేశారు. ఇదిప్పుడు హాట్ టాపిక్ అయింది.

  • Loading...

More Telugu News