: కత్తి తిప్పిన జడేజా...పెళ్లికి సర్వం సిద్ధం...ఆడిపాడనున్న రైనా, బ్రావో


టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పెళ్లికి సర్వం సిద్ధమైంది. గత రాత్రి ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా రాజ్ కోట్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన గుజరాత్ లయన్స్ జట్టు రెండు సంబరాలు చేసుకుంది. ఒకటి మ్యాచ్ గెలిచిన ఆనందంతోపాటు, జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సంగీత్ లో గుజరాత్ ఆటగాళ్లు సందడి చేశారు. ఈ సందర్భంగా జడేజా కత్తిపట్టాడు. సంగీత్ లో కత్తిని తిప్పి ఆకట్టుకున్నాడు. కాగా, నేటి సాయంత్రం జడేజా వివాహం రాజ్ కోట్ లో జరగనుంది. రాజ్ కోట్ కు చెందిన కాంట్రాక్టర్, వ్యాపారవేత్త ఏకైక కుమార్తె రివా సోలంకీతో జడేజా వివాహం, అత్తవారి స్టార్ హోటల్ లో జరగనుంది. ఈ వివాహానికి సర్వం సిద్ధమైంది. ఈ వివాహంలో జడేజా సహచరులు గుజరాత్ జట్టు కెప్టెన్ సురేష్ రైనా, డ్వెన్ బ్రావో ఆడి పాడనున్నారు. గుజరాత్ జట్టు ఆటగాళ్లంతా పెళ్లిలో భాగం కానున్నారు. ఈ వివాహానికి టీమిండియా క్రికెటర్లు, మాజీలు, జట్టు సిబ్బంది పలువురు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News