: మిసైల్ పోతే పోయింది... ఆటంబాంబును పరీక్షిద్దాం: ఉత్తరకొరియా
అమెరికాను చేరి పెను విధ్వంసాన్ని సృష్టించే సత్తా ఉన్న క్షిపణి పరీక్షను జరిపి విఫలమైన ఉత్తర కొరియా, దాన్ని మించిన అణు పరీక్షలకు దిగనుంది. ఇప్పటికే పలుమార్లు అణు పరీక్షలు నిర్వహించిన నార్త్ కొరియా, మరో పరీక్షల కోసం స్థలాన్ని పరిశీలిస్తోందని దక్షిణ కొరియా ఆరోపించింది. కాగా, ఈ పరీక్షలు జరిపితే, నెల రోజుల వ్యవధిలో రెండో దఫా అణు పరీక్షలు చేసినట్లవుతుంది. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా వినకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికాను, దక్షిణ కొరియాను కవ్వించేలా ఆయుధ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం బాలిస్టిక్ మిసైల్ పరీక్షలో విఫలమైన తరువాత, దాన్ని అవమానంగా భావించిన కిమ్, ఏకంగా అణు పరీక్షలకు అనుమతిచ్చినట్టు సమాచారం.