: హిందూపురం యువతిపై అఘాయిత్యానికి పాల్పడింది సొంత మేనమామే!


ఈ ఉదయం అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని సాయితేజ లాడ్జిలో ఓ అపస్మారక స్థితిలో కనిపించిన యువతి ఆసుపత్రిలో కోలుకొని, అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించింది. తన మేనమామ బాబు, తనకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకు వచ్చాడని తెలిపింది. ఆపై అత్యాచారం చేశాడని చెప్పింది. సహకరించని తనను విపరీతంగా కొట్టాడని చెప్పింది. ఆపై చంపబోయాడని ఆరోపించింది. ఆమె స్టేట్ మెంటును నమోదు చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, రొద్దం మండలానికి చెందిన బాబు అనే యువకుడితో కలసి యువతి లాడ్జికి రాగా,, ఆపై స్పృహ లేని స్థితిలో హోటల్ మేనేజ్ మెంటుకు ఈ ఉదయం కనిపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News