: ఆ బిల్లు పాస్ చేస్తే, మీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తాం: అమెరికాను హెచ్చరించిన సౌదీ


సెప్టెంబర్ 11, 2001న అమెరికాపై జరిగిన ఉగ్రదాడికి, సౌదీ ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని ఆరోపిస్తూ, నష్టపరిహారాన్ని వసూలు చేయాలని ఒబామా సర్కారు బిల్లును పాస్ చేద్దామని అనుకుంటున్న వేళ, సౌదీ అరేబియా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బిల్ పాస్ చేసే అవకాశాలు ఉన్నాయని తాము భావిస్తే, అమెరికా గడ్డపై తాము పెట్టిన పెట్టుబడులన్నింటినీ వెనక్కు తీసుకుంటామని సౌదీ విదేశాంగ శాఖా మంత్రి అబ్దెల్ అల్-జుబైర్ హెచ్చరించినట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గతంలో యూఎస్ ట్రెజరీ సెక్యూరిటీలను భారీగా కొనుగోలు చేసిన సౌదీ, వాటన్నింటినీ ఒకేసారి విక్రయానికి ఉంచుతుందని, దీంతో యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని ఆయన హెచ్చరించారు. మొత్తం 750 బిలియన్ డాలర్ల విలువైన ట్రెజరీ సెక్యూరిటీలను, ఇతర ఆస్తులను తాము విక్రయిస్తామని తెలిపారు. కాగా, యూఎస్ సెనెట్ ఈ బిల్లును పాస్ చేస్తే, యూఎస్ లోని సౌదీ ఆస్తుల లావాదేవీలు స్తంభించిపోతాయి. ఆ ప్రమాదం రాకముందే తాము స్పందించాలని సౌదీ భావిస్తున్నట్టు జుబైర్ వ్యాఖ్యానించారు. ఇటీవల సెనెట్ జ్యుడీషియరీ కమిటీ ఈ బిల్లును పాస్ చేయగా, ప్రస్తుతం, సెనెట్ పరిశీలనలో ఉంది.

  • Loading...

More Telugu News