: లక్నోలో కూలిన మెట్రో బ్రిడ్జి


ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో నిర్మితమవుతున్న మెట్రో రైల్ పిల్లర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మెట్రో పిల్లర్ కూలిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News