: అవార్డు రాకుంటే ఏడ్చేస్తానంటున్న బాలీవుడ్ బాద్షా
ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతున్న తన తాజా చిత్రం 'ఫ్యాన్'లో నటనకుగాను అవార్డు రాకుంటే తాను ఏడుస్తానని అంటున్నాడు షారూక్. ఫ్యాన్ చిత్రంలో తాను పరిణతి చెందిన నటనను ప్రదర్శించానని చెప్పిన ఆయన "ఈ దఫా నాకు అవార్డు రాకుంటే, అవార్డునే దొంగిలిస్తా... లేకుంటే ఏడుపు మొదలు పెడతా" అని వ్యాఖ్యానించాడు. తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ఆయన, ఫ్యాన్ లో అద్భుత నటనను కనబరిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం సల్మాన్ 'సుల్తాన్', అక్షయ్ 'రుస్తుం', అమీర్ ఖాన్ 'దంగల్', షారూక్ రెండో చిత్రం 'రయీస్'లు ఎలా ఉంటాయి, వాటిల్లో నటీనటుల ప్రతిభ ఆధారంగా షారూక్ కు అవార్డు వస్తుందా? రాదా? అన్నది ప్రభావితమై ఉంటుంది.