: గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్... 29న చంద్రబాబు శంకుస్థాపన
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండి, శరవేగంగా విస్తరిస్తున్న గుంటూరు నగరంలో తొలి ఐదు నక్షత్రాల హోటల్ ను నిర్మించేందుకు ఐటీసీ ముందుకు వచ్చింది. సుమారు రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితం కానున్న ఈ హోటల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 29వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. నగరం నడిబొడ్డున ఐటీసీకి ఉన్న సువిశాలమైన అతిథి గృహం స్థానంలో హోటల్ నిర్మితం కానుంది. మొత్తం 12 అంతస్తులు, 300 గదులతో ఈ హోటల్ నిర్మితమవుతుందని ఐటీసీ అధికారి ఒకరు వెల్లడించారు. హోటల్ శంకుస్థాపనకు సంస్థ చైర్మన్ వైసీ దేవేశ్వర్ హాజరవుతారని ఆయన వివరించారు.