: బాహుబలి-2 కథ ఇదే!: పరుచూరి గోపాలకృష్ణ అంచనా


రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి- ది కన్ క్లూజన్' చిత్రంపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఓ రచయితగా, రెండో భాగం కథను ఊహించి చెప్పారు. హీరోయిన్ అనుష్క అందాలు ప్రభాస్, రానాలను ఇద్దరినీ ఆకర్షించి వుంటాయని, ఇద్దరూ అనుష్కతో ప్రేమలో పడతారని చెప్పారు. అనుష్క వల్ల వారిద్దరి మధ్యా పగ మరింతగా పెరుగుతుందని అన్నారు. ఇదే బాహుబలి తరువాతి భాగం కథ అవుతుందని అనుకుంటున్నానని, అవునో... కాదో తెలియదని అన్నారు. ఆస్తి కోసం, అమ్మాయిల కోసం పోరాడే కథాంశంతో వచ్చే చిత్రాలు ఎప్పుడూ హిట్ అవుతాయని అన్నారు. దీనికి విజయేంద్రప్రసాద్ స్పందిస్తూ, సస్పెన్స్ పోవాలంటే వచ్చే సంవత్సరం వరకూ ఆగాలని అన్నారు. బాహుబలి కథలో రెండవ భాగాన్ని ప్రేక్షకులు చూశారని, మొదటి భాగాన్ని కొనసాగింపు చిత్రంలో చూస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News