: హిందూపురం లాడ్జిలో అపస్మారక స్థితిలో యువతి... లైంగికదాడి జరిగినట్టు అనుమానం!
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని సాయితేజ లాడ్జిలో ఓ యువతి అపస్మారక స్థితిలో రూములో పడుండటాన్ని చూసిన సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఒంటిపై పలు చోట్ల గాయాలుండటంతో లైంగిక దాడి జరిగినట్టు అనుమానిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. లాడ్జి రిజిస్టర్ లోని వివరాల ప్రకారం, రొద్దం మండలానికి చెందిన బాబు అనే యువకుడితో కలసి యువతి వచ్చిందని, ఆపై మరో ఇద్దరు గెస్టులుగా రూముకు వచ్చి వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, తన పేరును కూడా చెప్పలేకపోతున్నదని వైద్యులు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.