: కర్నూలు రాజకీయాలెలా?... లోకేశ్ తో భూమా చర్చలు
ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిసి చర్చలు జరిపారు. కర్నూలు జిల్లాలో తాజా రాజకీయాలు, పాతవారితో సంబంధాలను మెరుగుపరచుకునే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. భూమాతో పాటు నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన ఆయన అనుచరులు కూడా లోకేశ్ ను కలిశారు. భూమా చేరికను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలు తిరిగి మొదలవుతాయని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.