: దళితుల్లో ఒక్కరు కూడా అర్హులు లేరా?: కేసీఆర్ ను ప్రశ్నించిన మంద కృష్ణమాదిగ
తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు మంది మాల, మాదిగ ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఏ ఒక్కరూ మంత్రి పదవికి అర్హులు కాదా? అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ క్యాబినెట్ లో వెలమ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రులుగా ఉన్నారని మంద కృష్ణమాదిగ అన్నారు.