: సీఎం కేసీఆర్ పిలుపును స్వాగతిస్తున్నా: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసుకుందామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపును స్వాగతిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గొడవపడితే వచ్చేదేమీ ఉండదని ముందే చెప్పా, విభజన తర్వాత వచ్చిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నీటి పంపకాలతో పాటు పలు అంశాల్లో పొరుగు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.