: తెలంగాణ కాంగ్రెస్ జంబో కార్యవర్గం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జంబో కార్యవర్గాన్ని ఏఐసీీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి విక్రమార్కలనే కొనసాగించారు. కొత్త కార్యవర్గంలో 13 మంది ఉపాధ్యక్షులు, 31 మంది ప్రధాన కార్యదర్శులు, 35 మంది కార్యవర్గ సభ్యులుగా ఉంటారని ప్రకటించారు. వీరితో పాటుగా 22 మంది శాశ్వత ఆహ్వానితులు, ఒక కోశాధికారి, 31 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.