: ఆధార్ నంబరు ఉంటే చాలు, కార్డ్‌లెస్ ఏటీఎం సర్వీసు వాడుకోవచ్చు!
ఆధార్ నంబరు ఉంటే చాలు, త్వరలో కార్డ్‌లెస్ ఏటీఎం సర్వీసు పొందవచ్చు. ఈ విధానాన్ని ప్రైవేటు సెక్టార్ డీసీబీ బ్యాంక్ తీసుకొచ్చింది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని చేపట్టింది. దీంతో డెబిట్ కార్డు అవసరం లేకుండానే ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. దీంట్లో భాగంగా ఆధార్ కార్డులో ఉన్న వేలి ముద్రలను ఈ ఏటీఎం మెషీన్లకు అనుసంధానం చేస్తారు. ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి ఆధార్ కార్డు నంబర్‌తో పాటు మన వేలి ముద్ర ఇవ్వవలసి ఉంటుంది. త్వరలోనే ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నారు.