: ఓటర్లలో చైతన్యం తేవడానికి గిరిజన నేతలే ప్రచారకర్తలు
కేరళలో వచ్చేనెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనేలా వారిలో చైతన్యం తీసుకురావడం, వారు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా ఉండడమే లక్ష్యంగా ప్రచారానికి అక్కడి గిరిజన నేతల్ని రంగంలోకి దింపాలని ఎన్నికల అధికారులు యోచిస్తున్నారు. దీని కోసం ఆయా జిల్లాల అధికారులు వారిని సంప్రదించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల తేదీలను తెలియజేస్తూ ఓటర్లందరూ తప్పనిసరిగా పోలింగ్‌లో పాల్గొనడమే లక్ష్యంగా ప్రచారం చేసేందుకు ఏడుగురు గిరిజన నేతల్ని అధికారులు ఎన్నుకున్నట్లు సమాచారం.