: పవన్ అన్నయ్యతో 20 రోజులు కలసి ఉండే అదృష్టం కల్గింది: యువ డీజే పృధ్వీ
పవర్ స్టార్ పవర్ కల్యాణ్ తో కలిసి 20 రోజులు ఉండే అదృష్టం తనకు కలిగిందని యువ డీజే పృధ్వీ చెప్పాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో ఒక పాటను రీమిక్స్ చేయడం, పవన్ కల్యాణ్ పాడిన బీట్ సాంగ్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడమే కాకుండా ఆ చిత్రంలో డీజేగా కొంచెం సేపు కన్పించిన పృధ్వీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒక ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఒక పాట మిక్సింగ్ చేయమంటూ నాకు ఫోన్ కాల్ రావడంతో తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ను కలవడమే కాదు.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశమూ దక్కిందని, అంత పెద్ద సినిమాలో తనకు పిలిచి అవకాశమివ్వడం మరచిపోలేని ఒక జ్ఞాపకమని అన్నాడు. పవన్ అన్నయ్యతో ఇరవై రోజులు కలిసి ఉండే అదృష్టం ఈ చిత్రంతో తనకు లభించిందని పృధ్వీ ఆనందపడ్డాడు.