: దిలీప్ కుమార్ కోలుకుంటున్నారు, ఐసీయూలో ఉన్నార‌న్న వార్త‌లు అవాస్త‌వం: సైరా బాను


ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ అస్వస్థతకు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌ కోలుకుంటున్నట్లు దిలీప్ కుమార్ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఆయన సతీమణి సైరా బాను కొద్ది సేప‌టి క్రితం పేర్కొన్నారు. ఆయన ఐసీయూలో ఉన్నార‌ని వ‌స్తోన్న వార్తలు అవాస్త‌వ‌మ‌ని, జ్వరం, ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుప‌త్రిలో చేరార‌ని ఆమె చెప్పారు. ఆయ‌న కోలుకునేందుకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నార‌ని తెలిపారు. అయితే, గత కొంతకాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్న దిలీప్ కుమార్ ఆరోగ్యం నిన్న రాత్రి ఉన్నట్లుండి విషమంగా మారడంతో ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వార్తలొచ్చాయి.

  • Loading...

More Telugu News