: నేనేమీ రజనీకాంత్ ను కాదు, భయపడటానికి!: డీఎండీకే అధినేత విజయ్ కాంత్
అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయ్ కాంత్ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు భయపెడితే భయపడటానికి తానేమీ రజనీకాంత్ లా పిరికివాడిని కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రజనీ కాంత్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో పలు చోట్ల విజయ్ కాంత్ దిష్టి బొమ్మలను వారు దహనం చేశారు.