: తెలంగాణ మంత్రి ఈటల పీఆర్వో మృతి


తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పీఆర్వో, సీనియర్ జర్నలిస్టు దాసరి రవీందర్ (42) మృతి చెందారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వరుసగా రెండు ఆపరేషన్లు నిర్వహించగా, అనూహ్యంగా ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. దాసరి రవీందర్ స్వస్థలం కరీంనగర్ జిల్లా రాయకల్. కాగా, రవీందర్ మృతిపై తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూ డబ్ల్యూజే నేత క్రాంతికిరణ్ సంతాపం తెలిపారు. కాగా, దాసరి రవీందర్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ఇదిలా ఉండగా, రవీందర్ మృతి కారణంగా మిషన్ కాకతీయ మీడియా అవార్డుల కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.

  • Loading...

More Telugu News