: ఉప్పల్ స్టేడియం వద్ద మొదలైన అభిమానుల సందడి
ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఐపీఎల్ మ్యాచ్ లలో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య టీ 20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా మొట్టమొదటి మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్టేడియంకు వస్తున్న అభిమానుల సంఖ్య కొద్ది సేపటి నుంచే మొదలైంది. గతంలో జరిగిన ఇతర ఐపీఎల్ మ్యాచ్ లతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన అభిమానుల సంఖ్య తక్కువగానే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.