: కర్ణాటక రోడ్డుప్రమాదంలో క్రికెటర్ నగేశ్ దుర్మరణం
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక క్రికెటర్ నగేశ్ దుర్మరణం చెందాడు. క్రికెట్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం పావగడ తాలూకా తిరుమణి దగ్గర ఒక బైక్ ను తప్పించ బోవటంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నగేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో 14 మంది ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.