: తెలంగాణలో టీ టీడీపీ కరవు యాత్రలు... 18 నుంచి 25 వరకు చేపడతామన్న రావుల
తెలంగాణలో టీ టీడీపీ కరవు యాత్రలకు సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి 25 వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో కరవు యాత్రలు ఏకకాలంలో చేపట్టనున్నట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ యాత్రల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఏకకాలంలో జరగనున్న ఈ యాత్రల కోసం పది జిల్లాలకు పది కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన ప్రకటించారు. జిల్లాల్లో పర్యటించిన తమ పార్టీ కమిటీలు ఆయా జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితులపై జిల్లా కలెక్టర్లకు నివేదిక అందజేసి, నివారణ చర్యలు చేపట్టాలని కోరతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే... కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని రావుల పేర్కొన్నారు.