: కాల్పులు జరిగిన ప్రాంతాల్లో నేడు పర్యటించనున్న మెహబూబా ముఫ్తి.. వాతావరణం చల్లబడేనా?
ఓ బాలికపై భద్రతా బలగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ శ్రీనగర్‌లో కొందరు చేస్తోన్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం, వారిపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించడం తెలిసిందే. ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న అక్కడి కుప్వారా జిల్లాలో నేడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పర్యటించనున్నారు. నిరసనలతో అట్టుడుకుతోన్న ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం నాలుగు రోజులుగా వేడెక్కిన అక్కడి వాతావరణం చల్లబడుతుందని భావిస్తున్నారు. భద్రత కారణాల దృష్ట్యా అక్కడి పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్ నెట్ సర్వీసులను సైతం నిలిపేసిన సంగతి తెలిసిందే.