: నేడు తాజ్‌మహల్‌ను సంద‌ర్శించ‌నున్న ప్రిన్స్ విలియం దంప‌తులు.. భద్రత కట్టుదిట్టం


బ్రిటన్‌ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్‌ మిడిల్‌టన్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు తాజ్‌మహల్‌ను సంద‌ర్శించ‌నున్నారు. ఈ నేపథ్యంలో తాజ్‌మహల్‌ వద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాల్లో హోటళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఖేరియా ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్‌ వరకు భద్రత పెంచినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 10న భారత్ కు విచ్చేసిన ప్రిన్స్‌ విలియం దంప‌తులు ఇప్ప‌టికే ఇక్క‌డి ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ప్ర‌స్తుతం వీరిరువురూ భూటాన్‌లో ఉన్నారు. మ‌రికాసేప‌ట్లో అక్క‌డి నుంచి బ‌య‌లుదేర‌నున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విలియం దంపతులు తాజ్‌మహల్‌కు చేరుకుని అక్క‌డి అందాల‌ను వీక్షించ‌నున్నారు. అనంత‌రం బ్రిటన్‌కు బ‌య‌లుదేరుతారు.

  • Loading...

More Telugu News