: మరో నాలుగు రోజులు భానుడి ప్రతాపం... వాతావరణ శాఖ హెచ్చరికలు!


భానుడి భగభగలతో తెలుగు నేల విలవిల్లాడుతోంది. సూర్య తాపంతో నిన్న ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 50 మంది వడదెబ్బకు గురై చనిపోయారు. ఈ ఏడాది కాస్తంత ముందుగానే వచ్చేసిన ఎండలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మండే ఎండలతో బయటకు రావాలంటేనే.. జనం జడిసిపోతున్నారు. ఓ నాలుగు రోజుల పాటు ఎండలు మండిపోతాయని నాలుగు రోజుల క్రితం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భానుడి ప్రతాపం మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందట. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేడు సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో నాలుగైదు రోజుల పాటు భానుడి ప్రతాపం కొనసాగుతుందని ఆ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా కాలు బయటపెట్టవద్దని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News