: ఆ మంచి ప్రయత్నాన్ని బీజేపీ విఫలం చేయాలనుకుంటోంది: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు తాము అంచెల వారీగా కొనసాగించాలనుకుంటున్న మంచి ప్రయత్నాన్ని బీజేపీ ఉద్దేశపూర్వకంగా విఫలం చేయాలని చూస్తోందన్నారు. సరి-బేసి విధానం విఫలం చేయాలని బీజేపీ పిలుపునిస్తోందన్నారు. ఈ విధానాన్ని ఉల్లంఘించాలని పిలుపునిస్తూ బీజేపీ ఓ వైపు, బంద్ కు పిలుపునిస్తూ ఆ పార్టీ అనుబంధ ఆటో యూనియన్ మరో వైపు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సరి-బేసీ విధానాన్ని గతంలో అమలు చేసినప్పుడు కూడా బీజేపీ ఇదే విధంగా ఇబ్బందులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు మాత్రం సరి-బేసి విధానాన్ని విజయవంతం చేస్తారని, బీజేపీ చేస్తోన్న ప్రయత్నాలను తిప్పి కొడతారని అన్నారు.