: జగన్ గారూ! సీఎంఎస్ సర్వే చదవండి... వలసలకు కారణం తెలుసుకోండి: టీడీపీ నేత డొక్కా


ఏపీలో టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’కు వైసీపీ విలవిల్లాడుతోంది. తన పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న కారణం తెలియక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జుట్టు పీక్కుంటున్నారు. అధిక ప్రాధాన్యమిచ్చిన నేతలు కూడా పార్టీని వీడుతుండటంతో జగన్ డైలమాలో పడిపోయారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న కారణం టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు తెలిసిపోయిందట. గుంటూరులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా డొక్కా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఎందుకు చేరుతున్నారన్న కారణం తెలుసుకోవాలంటే... సీఎంఎస్ సర్వే నివేదికను చదవాలని ఆయన చెప్పారు. ఈ నివేదికను చదివితే తన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో ఎందుకు చేరుతున్నారో జగన్ కు కూడా అర్థమవుతుందని డొక్కా పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం విడుదలైన సీఎంఎస్ సర్వే... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును తిరుగులేని నేతగా అభివర్ణించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News