: ఎస్‌బీఐలో ప్రతిష్టాత్మ‌క‌ భారతీయ మహిళా బ్యాంక్ విలీనాంశం మ‌రోసారి తెర‌పైకి


భారతీయ మహిళా బ్యాంక్‌ను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయడానికి రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌య‌మై కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోన్నా, కేంద్ర‌ ప్ర‌భుత్వం భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం వైపే అడుగులేస్తోంది. కాగా, దీనిపై ఆ బ్యాంక్ వ‌ర్గాల నుంచి మిశ్ర‌మ‌ స్పంద‌న వ‌స్తోంది. ఏదో ఓ నిర్ణ‌యాన్ని చెప్పి అనిశ్చితిని త్వ‌ర‌గా తొల‌గించాలంటూ బ్యాంకు అధికారులు కోరుతున్నారు. కొత్త బ్యాంకులకు లైసెన్సులు ఇస్తూనే మ‌రోప‌క్క‌ విలీనం చేయ‌డం అనే అంశంపై జ‌రుగుతోన్న చ‌ర్చ ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌ ఉద్యోగులపైనా, బ్యాంకులపైనా ఈ అంశం తీవ్ర ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశం ఉందంటున్నారు. భారతీయ మహిళా బ్యాంక్‌ ను నిర్వ‌హించ‌డానికి అంత‌గా స‌మ‌స్య‌లు కూడా ఉండ‌బోవ‌ని చెబుతున్నారు. కాగా, భారతీయ మహిళా బ్యాంక్‌ (బీఎంబీ)ను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలని చాలా కాలం నుంచే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. 1000 కోట్ల రూపాయల మూలధనంతో బీఎంబీని 2013లో ప్రారంభించారు. మహిళా సాధికారిత కోసం ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఎస్‌బీఐ తన అసోసియేట్‌ బ్యాంకులు రెండింటిని విలీనం చేసుకుంది. ఇప్పుడు భారతీయ మహిళా బ్యాంక్‌ను కూడా ఎస్‌బీఐలో విలీనం చేయాల‌ని భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

  • Loading...

More Telugu News