: ఫలించిన అచ్చెన్న మంత్రాంగం!... బ్రాండెక్స్ లో మహిళా కార్మికుల ఆందోళన విరమణ


విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బహుళ జాతి కంపెనీ బ్రాండిక్స్ లో నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు బ్రేక్ పడింది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నెరపిన మంత్రాంగంతో కంపెనీ యాజమాన్యం దిగొచ్చింది. వేతనాల పెంపు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం ఆందోళనకు దిగిన మహిళా కార్మికులతో చర్చలు జరిపింది. వారంలోగా వేతనాల పెంపుతో పాటు పీఎఫ్ బకాయిలను క్లియర్ చేస్తామని కంపెనీ కార్మికులకు హామీ ఇచ్చింది. దీంతో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా ఆందోళన కొనసాగించిన మహిళలు శాంతించారు. అయితే నిర్దేశిత సమయంలోగా హామీలు అమలుకాకపోతే మరోమారు ఆందోళనకు దిగుతామని కార్మికులు కంపెనీ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. మహిళా కార్మికుల ఆందోళనపై సమాచారం అందుకున్న వెంటనే నేటి ఉదయం రంగంలోకి దిగిన అచ్చెన్నాయుడు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని శ్రీలంకకు చెందిన సదరు కంపెనీకి ఆయన తేల్చిచెప్పారు. మంత్రి ఆగ్రహంతో దిగివచ్చిన కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది.

  • Loading...

More Telugu News