: కుష్బుపై కేసు దాఖలు చేసిన హిజ్రా


మధురై కేంద్ర నియోజకవర్గం నుంచి ‘ఇలైంజర్‌ కూట్టమైప్పు’ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన హిజ్రా భారతి కన్నమ్మ కాంగ్రెస్ ప్రచారకార్యదర్శి, నటి కుష్బుపై కేసు దాఖ‌లు చేశారు. కుష్బు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హిజ్రాలను అవ‌మానప‌రిచేలా మాట్లాడారంటూ హిజ్రా భారతి కన్నమ్మ ఫిర్యాదు చేశారు. హిజ్రాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతపై కుష్బు చేసిన‌ వ్యాఖ్య‌లు తమను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని మధురై కోర్టులో భారతి కన్నమ్మ కేసు దాఖ‌లు చేశారు. ఈ కేసుపై పిటిషనర్ తరఫున న్యాయవాదులు నిన్న త‌మ వాద‌న‌లు వినిపించారు. అనంత‌రం కోర్టు కేసును ఈనెల‌ 25వ తేదీకి వాయిదా వేసింది. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థిగా మధురై లోక్‌సభ స్థానం నుంచి భారతి కన్నమ్మ గత ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News