: వరంగల్ జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య... అటవీ శాఖ వాహనానికి నిప్పు


రాష్ట్ర విభజన తర్వాత అటు విశాఖ జిల్లాతో పాటు ఇటు వరంగల్ జిల్లాలోనూ నిషేధిత మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకుంటున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలోని వరంగల్ జిల్లా తాడ్వాయి మండల పరిధిలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాడ్వాయి పరిధిలోని అటవీ శాఖ కార్యాలయంపై దాడి చేసిన మావోయిస్టులు ఆ శాఖ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ చర్యకు పాల్పడింది తామేనని కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరిట మావోయిస్టులు అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు.

  • Loading...

More Telugu News