: సీన్ రివర్స్!... భర్తను హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భార్య


హైదరాబాదులోని నల్లకుంటలో నిజంగానే సీన్ రివర్స్ అయిపోయింది. నిత్యం వేధింపులతో సతాయించే భర్తను హత్య చేసిన ఓ భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయింది. నేటి ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన నల్లకుంటలో కలకలం రేపింది. వివరాల్లోకెళితే... గంగాధర్, విజయలక్ష్మి భార్యాభర్తలు. నల్లకుంటలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో భర్త నుంచి ఎదురవుతున్న వేధింపులను విజయలక్ష్మి చాలా కాలం పాటు పంటి బిగువునే భరించింది. అయితే ఇటీవలి కాలంలో భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో సహనం కోల్పోయిన విజయలక్ష్మి... గంగాధర్ ను చంపేసింది. ఆ తర్వాత నేరుగా ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చి, తన భర్తను చంపేశానని చెప్పి పోలీసులకు లొంగిపోయింది.

  • Loading...

More Telugu News