: బెజవాడలో నకిలీ కరెన్సీ కలకలం!... పోలీసుల అదుపులో నలుగురు సభ్యుల ముఠా
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడ పరిసరాల్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ చెలామణి అవుతోంది. గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ కరెన్సీపై పక్కా సమాచారం అందుకున్న బెజవాడ పోలీసులు నిన్న రాత్రి ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు సభ్యులున్న ఈ ముఠా నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిని రహస్య ప్రదేశానికి తరలించి, ముఠా సభ్యుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.