: బంజారా హిల్స్ లో కార్ రేసింగ్... పోలీసుల అదుపులో కేంద్ర మంత్రి పుత్రరత్నం?


భాగ్యనగరి హైదరాబాదులో బైక్ రేసింగులు, కార్ రేసింగులకు అడ్డుకట్ట పడటం లేదు. సెలవు దినాలు, వారాంతాల్లో యువత అత్యాధునిక కార్లు, బైకులతో నగర రోడ్లపై రేసింగులతో హోరెత్తిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్న పోలీసులు యువతకు ముకుతాడు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి బంజారాహిల్స్ పరిధిలో యువత కారు రేసింగులతో హోరెత్తించింది. కారు రేసింగులపై సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి చేశారు. రేసింగుల్లో పాల్గొన్న నాలుగు కార్లను సీజ్ చేశారు. సదరు కార్లలో ఉన్న యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ కేంద్ర మంత్రి పుత్రరత్నం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News