: విఫలమైన విజయ్, మార్ష్, మిల్లర్, మ్యాక్స్ వెల్...ఆకట్టుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్
ఐపీఎల్ సీజన్ 9లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంకా కోలుకోలేదు. గత సీజన్ లో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న పంజాబ్ ఈసారి స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చడంలో విఫలమవుతోంది. మొహాలీ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ జట్టు బ్యాట్స్ మన్ ఇబ్బందులు పడుతున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆటగాళ్లున్నప్పటికీ బ్యాటింగ్ లో పంజాబ్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఆదిలోనే మురళీ విజయ్ (1) వికెట్ కోల్పోయింది. అనంతరం షాన్ మార్స్ (13) కూడా పెవిలియన్ బాటపట్టాడు. రెండు షాట్లతో కుదురుకునేలా కనిపించిన పంజాబ్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (9) కూడా అవుటయ్యాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్ పేలవమైన షాట్ ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో ఓపెనర్ వోహ్రా (31) కు అక్షర్ పటేల్ (0) జతకలిశాడు. దీంతో పంజాబ్ జట్టు పది ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా మూడు వికెట్లతో రాణించాడు.