: బీజేపీకి ఓటేసిందని విడాకులిచ్చిన భర్త!


బీజేపీకి ఓటేసిందన్న కోపంతో తనతో పదేళ్ల కాపురం చేసిన భార్యకు విడాకులిచ్చాడో భర్త. వివరాల్లోకి వెళ్తే...అసోంలో ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా సోనిట్ పూర్ జిల్లాలోని సోనమ్ అడ్డహతీ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని తీర్మానించారు. దీంతో అంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. అయితే దిల్వారా బేగం అనే మహిళ మాత్రం పెద్దల మాటను కాదని బీజేపీకి ఓటేసింది. ఈ విషయం ఎలా పొక్కిందో తెలియదు కానీ గ్రామంలో అలజడి రేపింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త అయినుద్దీన్ పదేళ్ల వివాహ బంధానికి చెల్లుచెప్పాడు. భార్య దిల్వారాకు విడాకులు (తలాక్) ఇస్తున్నట్టు ప్రకటించాడు.

  • Loading...

More Telugu News