: సచిన్ అభిమానులకు శుభవార్త...సచిన్ సినిమాలో సర్ ప్రైజ్
సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రపై 120 నిమిషాల నిడివి కలిగిన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సచిన్ బాల్యంలో పాత్రను ధరించే బాలుడి కోసం ఈ చిత్ర బృందం ఎంతో మందిని పరిశీలించింది. అయితే సచిన్ పోలికలు కలిగి మాస్టర్ బ్లాస్టర్ లా ప్రావీణ్యం చూపగల బాలుడు దొరకలేదు. దీంతో ఈ చిత్రబృందం ఎంతగానో అన్వేషించి చివరికి ఓ కుర్రాడిని తీసుకుంది. ఇంతకీ అతనెవరంటే సచిన్ తనయుడు అర్జున్! సచిన్ పాత్రను ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ కంటే బాగా ఎవరు వేయగలరని భావించిన చిత్రబృందం అతనితోనే సచిన్ బాల్యానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. మొత్తానికి ఈ సినిమాలో సచిన్ తో పాటు ఆయన తనయుడు కూడా సందడి చేయనున్నాడు. ఇది సచిన్ అభిమానులకు బోనస్ లాంటిదే.